Today Events March 24, 2023
*వర్క్ టు రూల్ పాటిస్తున్న ఏపీ అమరావతి జేఏసీ …నేడు ఆఫీస్ పని వేళల కంటే ముందుగా విధులు నిర్వర్తించకుండా అధికారులు, ఉద్యోగులను అడ్డుకోనున్న ఏపీ అమరావతి జేఏసీ
*నేడు బాసర ఆలయ పునఃనిర్మాణ పనులకు ఆంకురార్పణ..అమ్మవారి గర్భాలయ పునఃనిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
*నేడు పల్నాడు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన.. సత్తెనపల్లి పట్టణ బిజెపి కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరుకానున్న సోము వీర్రాజు
*చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరనున్న కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి… నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
* సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అత్యవసర విస్తృత సమావేశం… స్టీరింగ్ కమిటీ, జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం.
*నేడు బాన్స్ వాడ లో స్పీకర్ పోచారం పర్యటన … అయ్యప్పస్వామి దేవాలయం వద్ద నూతన సన్నిధానం నిర్మాణానికి భూమి పూజ చేయనున్న స్పీకర్
*నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన… బాల్కొండ లో బి.ఆర్.ఎస్. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న మంత్రి
* విశాఖలో సీసీఎల్ సందడి…నేడు, రేపు జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ లు, ఏసిఏ-వి డి సి ఏ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ లు.. ప్రాక్టీస్ లో పాల్గొంటున్న తెలుగు, కన్నడ, హిందీ నటులు
* ఈ నెల 31 వరకు కడప – నంద్యాల మధ్య నడిచే డెమో రైలు రద్దు..రైలు నిర్వహణ, వసతుల ఆధునీకరణ కోసం తాత్కాలికంగా రద్దు
* కడపలోని యోగి వేమన యూనివర్సిటీ లో 26న అంతర్ కళాశాల సాప్ట్ బాల్, లాన్ టెన్నిస్ పోటీలు..
* కడపలో నేడు ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మెన్ దేవి రెడ్డి శ్రీనాథ్ రెడ్డి అంత్య క్రియలు..సింహాద్రిపురం మండలం కోరుగుంటపల్లిలో అంత్యక్రియలు
* గుడ్ మార్నింగ్ రాజమండ్రి అంటూ అన్నపూర్ణమ్మ ఏరియాలో పర్యటిస్తున్న ఎంపీ మార్గాని భరత్ రామ్.. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న భరత్
*శ్రీహరికోటలోని సతీష్ ధావన్ నల్అంతరిక్ష కేంద్రంలో GSLV మార్క్ 3 రాకెట్ ప్రయోగం పై మెషిన్ రెడీనెస్ రివ్యూ సమావేశం
*నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవ సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్న వైద్యశాఖ అధికారులు