సింహాచల పుణ్యకేత్రంలో వరాహ నరసింహ స్వామి నిజరూప దర్శనం ప్రారంభమైంది. అప్పన్న స్వామిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పుణ్యక్షేత్రంలో భక్తులతో కిటకిటలాడుతోంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూపంలో దర్శనం ఇస్తారు. అందువల్ల భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు ఆలయ అధికారులు.. పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీవీఐపీల రాకతో ఆలయం దగ్గర తోపులాటలు జరుగుతున్నాయి. భక్తులకు దర్శనం ఆలస్యం అవుతుందని అంటున్నారు. అయితే ఆలయ అధికారులుమ మాత్రం టైమ్ స్లాట్ ప్రకారమే దర్శనాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రతీ సంవత్సరంలా కాకుండా.. ఈ ఏడాది సాయంత్రం వరకు కూడా స్వామి వారి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Bhakthi TV : అక్షయ తృతీయ నాడు ఈ స్తోత్రాలు వింటే సకల పాపాలు పటాపంచలై.. సర్వ సంపన్నులవుతారు
ఉత్తరాది జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులు వేలాది మంది అప్పన్న నిజరూప దర్శనం భారీగా తరలి వచ్చారు. వీఐపీలకు పెద్దపీఠ వేయడంలో సామాన్య భక్తుల కోసం.. ప్రత్యేక దర్శనాలతో పాటు సర్వ దర్శనాలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అయితే టికెట్ల విక్రయాలు, స్లాట్ కేటాయింపుల్లో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇవాళ సాయంత్రం వరకు అప్పన్న స్వామి నిజరూప దర్శనం కొనసాగుతుంది. శనివారం అర్థరాత్రి నుంచి చందనోత్సవం ప్రారంభమైంది. దాదాపు లక్షకు పైగా భక్తులు ఈ ఉత్సవానికి వస్తుండటంతో దానికి తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటి సారిగా టైమ్ స్లాట్ దర్శనాలు కూడా కేటాయించినప్పటికీ అంతరాలయ దర్శనాలపై ఆలయ ట్రస్ట్ బోర్డు, ఉత్సవ కమిటీకి మధ్య విభేదాలు తలెత్తాయి. దాదాపు ఆరు వేల మందికి అంతరాలయ దర్శనం కల్పించాలని ఉత్సవ కమిటీ నిర్ణయిస్తే.. అంతమందికి అంతరాలయ దర్శనం కల్పించలేమని పాలక మండలి లేఖ రాసింది.
Also Read : HD Kumaraswamy : అనారోగ్యం కారణంగా హాస్సిటల్లో చేరిన మాజీ సీఎం