* తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంట ఉగాది వేడుకలు.. ఉగాది వేడుకల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి.. వేడుకల కోసం తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు
* తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఉగాది వేడుకలు.. పంచాంగ శ్రవణాలు
*ఇంద్రకీలాద్రిపై నేటి నుండి చైత్రమాస వసంతోత్సవాలు..మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం..31 వ తేదీన పూర్ణహుతితో ఉత్సవాల ముగింపు..అదే రోజు శ్రీరామ పట్టాభిషేకం
*విశాఖ G20 సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇవాళ,రేపు వర్క్ షాప్ నిర్వహిస్తున్న కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ…నగరాల అభివృద్ధి కి ప్రయివేట్ పెట్టుబడులు ఎలా అనే అంశంపై చర్చ
*విశాఖలో నేడు సింహాద్రి అప్పన్న పాదాలను తాకనున్న సూర్యకిరణాలు.. దేవాలయంలో అప్పన్న పెళ్ళిరాట మహోత్సవం..ఆలయంలో పంచాంగ శ్రవణం..ఉగాది ఉత్సవం..పండిత సత్కారం..
*విజయవాడలో నేడు ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..భవాని ఐలాండ్ లో ఉగాది వేడుకలకు హాజరుకానున్న మంత్రి రోజా
* ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలు.. దుర్గమ్మ కు ప్రత్యేక పూజలు,సాయంత్రం వెండి రధోత్సవ కార్యక్రమం
*దేవుని కడపలో ఉగాది వేడుకలు..శ్రీ లక్షీ వేంకటేశ్వర స్వామిని పెద్ద ఎత్తున దర్శించుకున్న ముస్లింలు
*ఉగాది సందర్భంగా పంచారామ క్షేత్రమైన అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానంలో పంచాంగ శ్రవణం…
*గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాహితీ వసంతోత్సవం …హాజరుకానున్న గజల్ శ్రీనివాస్
*బాపట్ల జిల్లా చీరాలలో యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం.. హాజరుకానున్న ఎంపీలు బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ ఇన్చార్జ్ కరణం వెంకటేష్
*విజయనగరంలోని శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి వారి ఆలయంలో నేడు శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు… ఈ కార్యక్రమంలో పాల్గొననున్న జిల్లాకు చెందిన మంత్రులు, ప్రముఖులు, ఇతర ప్రజా ప్రతినిధులు..
*తిరుపతిలో నేడు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది ఆస్దానం