Temperatures: భగ్గుమంటోన్న భానుడి ప్రభావంతో.. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పదిసార్లు జనం ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పగటిపూటే కాదు.. రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
Also Read : TSPSC : జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వడగాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. భానుడి ప్రతాపంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 46 డిగ్రీలను దాటిపోయింది. ప్రకాశం 46, ఏలూరు, విజయవాడలో 47, గుంటూరులలో 48 డిగ్రీలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల టెంపరేచర్లు నమోదు అయినట్లు వెల్లడించింది.
Also Read : Nandini Reddy: ఇలాంటి సినిమాకు సంగీతం సమకూర్చడం ఓ ఛాలెంజ్ : మిక్కీ జె మేయర్
ఇక వడదెబ్బతో ఏపీలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. వడదెబ్బ తగిలి పలువురు ఆస్పత్రిపాలయ్యారు. పరిస్థితి మరో మూడురోజులు ఇలాగే ఉంటుందని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులతో హెపటైటిస్-బీ ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు తెలిపారు. బయటకు వెళ్లేవాళ్లు తలకు రక్షణ ధరించాలి, మంచినీళ్లు, సహజ సిద్ధమైన పానీయాలు, ఓఆర్‌ఎస్ లాంటి ఎనర్జీ డ్రింక్స్ ను తీసుకెళ్లడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ నుంచి రక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్ వాడడం, కాటన్ దుస్తులు.. కళ్లజోడు ధరించడం లాంటివి చేయాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.