స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబుపై చేసినవి ఆధారాలు లేని ఆరోపణలు అంటూ సిద్ధార్థ్ లూథ్రా పేర్కొన్నారు. చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హజరుపరిచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయినా కూడా ప్రభుత్వం వాళ్లకున్న చోటే ప్రవేశపెట్టింది అని లూథ్రా ఆరోపించారు.
Read Also: Rio G20 meet: జీ20 మీటింగ్‌లో పుతిన్ అరెస్టుపై బ్రెజిల్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు..
సీఐడీ అధికారులు ఆరోపణలు చేసినట్లు చంద్రబాబు లండన్ వెళ్లడం లేదు అని సిద్ధార్థ్ లూథ్రా పేర్కొన్నారు. చంద్రబాబు ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు సీఐడీ చెబుతుంది.. అందులో ఎలాంటి నిజం లేదు.. అంతకు ముందు రోజే చంద్రబాబుని రాత్రి 11 గంటలకు సీఐడీ పోలీసులు చుట్టుముట్టారని బాబు తరపు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులను కోర్టుకు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా న్యాయమూర్తిని కోరారు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీఐడీ నడుచుకోలేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ పర్మిషన్ అవసరమని లూథ్రా వాదించారు.
Read Also: Samantha : స్టైలిష్ లుక్ లో పరువాల ప్రదర్శన చేస్తున్న సామ్..
ఇది అనుబంధ పిటిషన్ మాత్రమేనని సీఐడీ తరపు న్యాయవాది వాదించారు. రిమాండ్ రిపోర్ట్ వారకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలని అని సీఐడీ తరపు లాయర్ కోరారు. అయితే, ఈ సందర్భంగా జడ్జ్ మాట్లాడుతూ.. కోర్టు హాలులో 30 మందికి మించి ఉండకూడదని పేర్కొన్నారు. విచారణ హాలు నుంచి మిగతావారిని బయటకు వెళ్లాలని న్యాయమూర్తి ఆదేశించారు.