ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై జరిగిన దాడి తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నేపథంలో భాగంగా మళ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని మొదలుపెట్టబోతున్నారు సీఎం. శనివారం నాడు జరిగిన దాడిలో సీఎం జగన్ పై ఓ గుతూ తెలియని ఆగంతకుడు రాయి విసిరిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయనకు కంటి పై భాగంలో చిన్నపాటి గాయం కారణంగా నేడు విశ్రాంతి తీసుకున్నారు. దాంతో నేడు బస్సు యాత్రకు విరామం ప్రకటించారు…
ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో భాగంగా ఇప్పటికే అన్ని పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించారు. దీంతో వారందరూ వారి నియోజకవర్గాలలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 25న సీఎం జగన్ పులివెందుల నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన శ్రీకాకుళంలో జరిగే ‘ మేమంతా సిద్ధం’…
రాజ్యసభ సభ్యురాలుగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రమాణస్వీకారం చేశారు. సోనియా గాంధీ చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా సోనియాగాంధీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. Also read:…
ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి మనకు తెలిసింది. పరీక్షా సమయం కావడంతో విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని అధిగమించి మరీ పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో తాజాగా విద్యార్థులను గుండెపోట్లు సైతం వెంటాడుతున్నాయి. పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు నిద్రలేమి కారణంగానో.. మరో ఒత్తిడి కారణంగా తెలియదు కానీ., విద్యార్థులని అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. Also Read: Skill…
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. మొత్తం 12మంది ఐఏఎస్ అధికారుల్ని విచారించాలని సీఐడీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని ఐఏఎస్ అధికారుల్ని విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ సీఐడీకి న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. బాణా సంచా పేల్చి, మోడీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన మహిళలు.. బీజేపీ మహిళా మోర్చా నేతలు.. దశాబ్దాల కలను ప్రధాని మోడీ సాకారం చేశారు అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ కు సవాల్ విసిరే స్థాయి నారా లోకేష్ కు లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లోకేష్ స్థాయి ఏమిటి, లోకేష్ బ్రతుకు ఏమిటని ఆయన అన్నారు. ఈడీ, సీఐడీ ఇన్కమ్ టాక్స్ చర్చకు రమ్మని పిలుస్తున్నాయి.. వాటికి ముందు సమాధానం చెప్పు.. 118 కోట్లుకు సంబంధించి ఇన్ కం ట్యాక్స్ పిలిస్తే తప్పించుకుని తిరుగుతున్నారు అంటూ మంత్రి సెటైర్ వేశారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించింది బీజేపీ ప్రభుత్వమే అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా నారాయణగూడ వైఎంసీఏ సిగ్నల్ దగ్గర షోయబుల్లాఖాన్ చిత్ర పటానికి నారాయణ ఘన నివాళులు అర్పించారు.