మంగళగిరి వైసీపీ అడ్డా.. అభ్యర్థి ఎవరైనా గెలిచేది వైసీపీ అభ్యర్థేనని మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళగిరి సామాజిక సాధికార ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. లోకేష్‌ను మడత పెట్టేస్తాం, టీడీపీని కృష్ణానదిలో కలిపేస్తామని ఆయన అన్నారు. మంగళగిరిలో గంజి చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్లు, వైఎస్ జగన్ గెలిచినట్లు అని మంత్రి తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ ఐదో జాబితాను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇంఛార్జుల మార్పును ప్రకటించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి రావెలను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.
ఏపీలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో రిజిస్ట్రేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్లు రెండు రోజులుగా మొరాయిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కాసేపు రిజిస్ట్రేషన్లు జరిగితే కాసేపు నిలిచి పోతున్నాయి.
ఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. వచ్చే నెల 16వ తేదీ నుంచి రెండు వారాల పాటు చేయూత పథకం నాలుగో విడత చెల్లింపులు జరుపుతామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. తనపై చంద్రబాబు మితిమీరి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. "నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా ?. నీ లాగా మామకు వెన్నుపోటు పొడిచానా ?. చంద్రబాబు నువ్వు అధికారంలోకి రావు. కనీసం కుప్పంలో కూడా గెలవలేవు. కుప్పంకు మేము నీరు ఇస్తున్నాం... 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏమి చేశావ్. రాజకీయంగా చూసుకోలేక చౌకబారు విమర్శలకు దిగారు. ఓటమి భయంతో చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారు." అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలు కోపంతో, ఉక్రోషంతో వున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని వంద అడుగుల లోతులో పాతి పెట్టేయడం ఖాయమని ఆయన అన్నారు. శ్రీలంకలో రాజపక్సే ప్రభుత్వాన్ని తరిమి కొట్టినట్టే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు.
చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు సభలు పెడుతున్నారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాయలసీమలో కరవు కాటకాలు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు.
తన రాజకీయ విరామంపై ఎంపీ గల్లా జయదేవ్ క్లారిటీ ఇచ్చారు. గుంటూరులో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సభ నిర్వహించారు ఎంపీ గల్లా జయదేవ్. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఎంపీగా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.