ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైంది. నేటి(బుధవారం) నుంచి అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంపై మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని.. త్వరలో కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు తాగునీరు, సాగునీటి కష్టాలు తీరనున్నట్లు ఆయన వెల్లడించారు.
బెజవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో రాధా, ఉమా వర్గీయుల మధ్య పోరు ముదురుతోంది. వంగవీటి రాధాను టీడీపీ నమ్మడం లేదంటూ 3 రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్‌లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్‌లో సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు.
వైసీపీకి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామాపై స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ప్రాంతీయ పార్టీలలో అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
షర్మిల ఇప్పడు జగనన్న వదిలిన బాణం కాదు.. అవన్నీ పాత రోజులని సినీనటుడు, జనసేన నేత పృధ్వీ అన్నారు. ఇప్పడు షర్మిల ఇండివిడ్యువల్.. కాంగ్రెస్ పార్టీ బాణం.. పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ బాణం వల్ల వైసీపీ వారికి ఏం జరుగుతుందో చూడాలన్నారు. టీడీపీ, జనసేనల రెండు జెండాల కలయిక అద్భుతం.. ఇది మార్పుకు శుభసూచికమన్నారు
అయోధ్యను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. అయోధ్య ఈవెంట్‌తో దేశం సంతోషంగా వుందని చాటి చెప్పే ప్రయత్నం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో టీడీపీ నేత కేశినేని చిన్ని తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరుడుగా మారాడని.. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుకే నాని తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
వైసీపీకి, ఎంపీ పదవికి నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. నరసరావు పేటలో కొత్త అభ్యర్దిని పెట్టాలని అధిష్టానం భావించిందని.. ఈ రోజు రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని ఆయన అన్నారు.