అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం అంబాజీపేటలో అంతరాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. అంబాజీపేట జడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌లో అంతర్రాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరగగా.. పురోహిత జట్లు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. పంచెలు కట్టుకొని బ్రాహ్మణ పురోహితులు క్రికెట్ ఆడారు.
మూడు సార్లు సీఎంగా చేస్తే, మ్యానిఫెస్టోలో పెట్టినవి అమలు చేశాను చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. మళ్లీ అవకాశం ఇవ్వండి అని సిగ్గులేకుండా అడుగుతున్నారని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కార్యకర్తలు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. 'సిద్ధం' పోస్టర్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు.
ఏపీలో ఎన్నికల నిర్వహణపై సీఈఓ ఎంకే మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై సీఈఓ సమీక్ష చేపట్టారు. ఓటర్ల నమోదు, మార్పు చేర్పుల దరఖాస్తుల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
బెజవాడ పశ్చిమలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెజవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలని.. ఇవాళ ర్యాలీ బల ప్రదర్శన కాదు మైనార్టీల వాయిస్ అని ఆయన పేర్కొన్నారు.
బడ్జెట్‌లో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన ఉండదు.. ఇది దేశ బడ్జెట్ అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట్రాలకు గత బడ్జెట్‌లో దీర్ఘకాలం పాటు సున్నా వడ్డీతో రుణాలు ఇచ్చారు.. ఇప్పుడు కూడా కేటాయించారని తెలిపారు. విభజన చట్టంలో పొందుపరిచిన చాలా అంశాలు నెరవేర్చారని.. ఖచ్చితమైన డెడ్ లైన్ అవసరం లేదన్నారు.
సినీనటుడు శివాజీ ఓటు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు డబ్బులు అడగొద్దని.. తప్పు చేసి చాలా మంది సంపాదిస్తున్నారని ఆయన ప్రజలకు సూచించారు. తెలుగు వాడికి కష్టం వస్తే తాను సహించనని.. అన్యాయం చేస్తే ఎంతటి వాడినైనా ప్రశ్నిస్తానని అన్నారు.
ఎన్నికల కోసమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అందమైన భాషతో అందమైన అబద్ధాలు నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన అన్నారు. రాముడిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బీజేపీ నేతలు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
అనకాపల్లి జిల్లాలో వాలంటీర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఈ ఘటనకు కారణమని అనుమానిస్తుండగా.. మృతుడి శరీరంపై విచక్షణ రహితంగా గాయాలు వున్నాయి
దేశానికి మార్గదర్శనం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నామన్నారు.