Nadendla Manohar: దేశానికి మార్గదర్శనం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్ర బడ్జెట్టును స్వాగతిస్తున్నామన్నారు. యువతను ప్రోత్సహిస్తూ.. స్టార్టప్ కంపెనీలను ప్రొత్సహించేలా బడ్జెట్ రూపకల్పన చేశారని ఆయన అన్నారు.
Read Also: Nallapareddy Prasanna Kumar Reddy: డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం ఫ్యాన్‌కు వేయండి..
మేం రూపొందించిన షణ్ముఖ వ్యూహంలో యువతకు ఉపాధి కల్పించే అంశానికి ఇది దగ్గరగా ఉందన్నారు. మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించేలా నిర్ణయాలు ఉన్నాయన్నారు. రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు వంటివి మధ్య తరగతి ప్రజలకు సీఎం జగన్ పెంచిన విద్యుత్ ఛార్జీల నుంచి ఊరటనిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకే టూరిజం అభివృద్ధికి నిధులిస్తామనడం హర్షించదగ్గ విషయమన్నారు. సువిశాల సాగరతీరం ఉన్న ఏపీకి కేంద్రం ప్రతిపాదించిన టూరిజం పాలసీ లాభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.