YSRCP 5th List: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ ఐదో జాబితాను విడుదల చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇంఛార్జుల మార్పును ప్రకటించారు. 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాల్లో మార్పులను ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌కు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ అధిష్ఠానం.
Read Also: IPS: 8 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు, బదిలీలు, అదనపు బాధ్యతలు
ప్రకటించిన స్థానాలు ఇవే..
కాకినాడ (ఎంపీ)- చలమలశెట్టి సునీల్,
నర్సరావుపేట(ఎంపీ)-అనిల్‌కుమార్ యాదవ్
తిరుపతి (ఎంపీ)-గురుమూర్తి
మచిలీపట్నం (ఎంపీ)- సింహాద్రి రమేష్ బాబు
సత్యవేడు (ఎమ్మెల్యే) – నూకతోటి రాజేష్
అరకు వేలి (ఎమ్మెల్యే)- రేగం మత్స్యలింగం
అవనిగడ్డ (అసెంబ్లీ) – డా.సింహాద్రి చంద్రశేఖరరావు.
ఐదో జాబితాలో మూడు కొత్త పేర్లు నూకతోటి రాజేష్, రేగం మత్స్యలింగం, డా. సింహాద్రి చంద్రశేఖర్ రావు ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో రెండోసారి మార్పు జరిగింది. అరకు అసెంబ్లీకి గొడ్డేటి మాధవి స్థానంలో మత్స్యలింగంకు అవకాశం దక్కింది. మాధవికి అరకులో వచ్చిన వ్యతిరేకతతో హైకమాండ్ వెనక్కి తగ్గింది. మాధవిని ఇంఛార్జ్‌గా అంగీకరించమని స్థానిక నాయకత్వం ఆందోళన చేసింది. ఆదిమూలం పార్టీ ఫిరాయింపుతో పాత స్థానానికి గురుమూర్తిని నియమించారు. తిరుపతి ఎంపీగా మళ్లీ గురుమూర్తికే అవకాశం కల్పించారు. తర్జనభర్జనల తర్వాత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అవనిగడ్డ బాధ్యతలు ప్రముఖ సర్జికల్ అంకాలజిస్ట్ డా.సింహాద్రి చంద్రశేఖరరావుకు అప్పగించారు. మరోసారి కాకినాడ లోకసభ నుంచి బరిలో చలమలశెట్టి సునీల్ నిలబడనున్నారు. వరుసగా మూడు సార్లు చలమలశెట్టి సునీల్ ఓటమి పాలయ్యారు. 2019లో టీడీపీ, 2014లో వైసీపీ, 2009లో పీఆర్పీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి చలమలశెట్టి సునీల్ ఓటమి పాలయ్యారు.