Minister Jogi Ramesh: రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి తీరుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jogi Ramesh: మంగళగిరి వైసీపీ అడ్డా.. అభ్యర్థి ఎవరైనా గెలిచేది వైసీపీ అభ్యర్థేనని మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళగిరి సామాజిక సాధికార ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. లోకేష్‌ను మడత పెట్టేస్తాం, టీడీపీని కృష్ణానదిలో కలిపేస్తామని ఆయన అన్నారు. మంగళగిరిలో గంజి చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్లు, వైఎస్ జగన్ గెలిచినట్లు అని మంత్రి తెలిపారు. మంగళగిరి పేరు తెలియని వాడికి మంగళగిరి సీటు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. జగనన్న కట్ అవుట్ చాలు మంగళగిరిలో వైసీపీ గెలవడానికి అంటూ వ్యాఖ్యానించారు. 17 మందితో ఎస్సీ, బీసీ, మైనారిటీల మంత్రి వర్గం ఏర్పాటు చేసిన ఘనుడు సీఎం జగన్ అని ఈ సందర్భంగా చెప్పారు.
Read Also: YSRCP 5th List: వైసీపీ ఐదో జాబితా విడుదల.. ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్
Also Read
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
సామాజిక న్యాయం చేయాలంటే మంగళగిరిలో టీడీపీ బీసీ అభ్యర్థిని నిలపాలని ఆయన సవాల్ విసిరారు. పవన్, చంద్రబాబు కాదు, పది మంది కలిసి వచ్చినా జగన్ సింగిల్‌గా గెలుస్తాడన్నారు. సొంత సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానాన్ని అమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ ఆయన ఆరోపించారు. రాజ్య సభకు కూడా ఎస్సీ, బీసీ మైనార్టీలను పంపిస్తున్న నాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. ఏపీలో ఆధార్ కార్డు లేని చంద్రబాబు, పవన్, లోకేష్ లాంటి వాళ్ళు ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో తిండి తిని ఏపీలో విషం కక్కుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి తీరుతామని మంత్రి జోగి రమేష్ అన్నారు.
తాజావార్తలు
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!