IPS Transfers: ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు, బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లా అండ్ ఆర్డర్ ఏడీజీ శంకభ్రత బాగ్చీకి హోం గార్డ్స్ ఏడీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ రాజశేఖర్ బాబుకు కోస్టల్ సెక్యూర్టీ ఐజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా కృష్ణ కాంత్‌కు బాధ్యతలు అప్పగించారు.
Read Also: Breaking: ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు
సీఐడీ ఎస్పీగా గంగాధర్ రావు, కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్‌కు కాకినాడ బెటాలియన్ కమాండెంటుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంటుగా రత్న, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంటుగా అమిత్ బర్దార్, ఇంటెలిజెన్స్ విభాగానికి ఆనంద రెడ్డి బదిలీ అయ్యారు.