తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడు గ్రామంలో పులి సంచారం కలకలం రేపుతోంది. తాజాగా ఈరోజు ఉదయం అడవి పందిని పులి చంపి అడవి పంది మాంసాన్ని తిని పెద్దపులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతుల సంక్షేమానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి వెల్లడించారు. శుక్రవారం మార్కాపురం ఏఎంసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విశాఖ జిల్లాలో తహశీల్దార్ హత్య కేసు సంచలనం సృష్టించింది. ఎమ్మార్వో ఇంటికి వెళ్లి ఓ ఆగంతకుడు రాడ్‌తో కొట్టి చంపేశాడు. రెవెన్యూ సిబ్బందిపై ఈ తరహా దారుణం విశాఖలో మొదటి సారి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ ఏలూరు జిల్లా పర్యటించనున్నారు. ఏలూరు జిల్లాలోని దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. సిద్ధం ఎన్నికల శంఖారావం సభకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి లక్షలాది మంది క్యాడర్ హాజరు కానున్నారు.
విశాఖలో అర్ధరాత్రి దుండగులు చెలరేగి పోయారు. విజయనగరం జిల్లా బంటుమిల్లి తహాసీల్దార్ రమణయ్యను ఇనుపరాడ్డులతో తలపై కొట్టి పరారయ్యారు దుండగులు. కొమ్మాదిలోని తహశీల్దార్ రమణయ్య నివశిస్తున్న అపార్ట్ మెంట్‌లోకి చొరబడి ఆయనపై దాడి చేశారు. వాచ్‌మెన్ గట్టిగా కేకలు వేయడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
విజయవాడలో టీడీపీకి మరో షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణ వైఎస్సార్‌సీపీలోకి చేరారు.
ఏపీలో అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ పార్టీ.. వై నాట్ 175.. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల నినాదం ఇదే.. ఎవరెవరు కలిసినా.. ఎంత మంది తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా.. తనదే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో.. ప్రజాప్రతినిధులను, నేతలను, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. వైసీపీ కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు సీఎం జగన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జులను మారుస్తోంది. తాజాగా పార్టీ అధిష్టానం శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను విడుదల చేసింది.
వీఆర్ఏలకు డీఏను రూ.300 నుంచి 500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి వెల్లడించారు. డీఎను పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.