Anakapalli: అనకాపల్లి జిల్లాలో వాలంటీర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఈ ఘటనకు కారణమని అనుమానిస్తుండగా.. మృతుడి శరీరంపై విచక్షణ రహితంగా గాయాలు వున్నాయి. మృతుడు మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామానికి చెందిన నడింపల్లి హరి అని గుర్తించారు. బుధవారం రాత్రి 8గంటల సమయంలో స్నేహితులు పిలవడంతో బయటకు వెళ్లినట్టు తెలిసింది. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. ఈ క్రమంలో గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని కాలువ దగ్గర పొలాలలో మృతదేహాన్ని రైతు గుర్తించాడు. అత్యంత కిరాతకంగా చంపిన సంఘటనపై పోలీసులు ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం ఏఎస్పీ, ఇద్దరు సీఐలు క్లూస్ టీంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Read Also: CM YS Jagan: ఈ నెల 3న దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్