ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. పరీక్ష ఫలితాల్లో తెలంగాణ యువతి అలేఖ్య(24) ఫస్ట్ ర్యాంకు సాధించి సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. హనుమకొండకు చెందిన మాధవీలత, పరిమి మనోజ్ కుమార్ దంపతుల కుమార్తె అలేఖ్య హైదరాబాద్ పెండేకంటి కాలేజీలో 2022లో న్యాయశాస్త్ర విభాగంలో ఉత్తీర్ణత సాధించారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారి గూడెంలో పెద్దపులి సంచారం హడాలెత్తిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని రెండు ఆవులు, ఒక దూడపై పులి దాడి చేసింది. తెల్లవారుజామున పొలంలోకి వెళ్లిన రైతులు గాయపడిన ఆవులను చూసి పులి దాడి జరిగినట్టుగా గుర్తించారు.
రేపు టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. 2024-25 వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలుపనుంది. 5 వేల కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఒంగోలులో పేదలకు ఇళ్లస్దలాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పేదల స్థలాల కోసం 231 కోట్ల రూపాయలు విడుదల చేసిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను దాదాపు మూడేళ్ల తర్వాత ఆమోదించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటి వరకు పెండింగ్‌లో పెట్టిన స్పీకర్.. ఇప్పుడు ఆమోద ముద్ర వేయడంపై గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు.
దొంగ ఓట్లతో గెలవాలని జగన్ కుట్రలు చేస్తున్నారని.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి తెలిపారు. బీజేపీ సోషల్ మీడియా విభాగంతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై పురంధేశ్వరి దిశా నిర్దేశం చేశారు.
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినకామన పూడి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గన్ పౌడర్ పేలి ఓ కూలీ మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గన్ పౌడర్ (తుపాకీ మందు) పేలి చేపల చెరువుల వద్ద పని చేసే కూలీలిద్దరు తీవ్రంగా గాయపడగా... వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.