Ganta Srinivasa Rao: రాష్ట్రంలో అన్ని వర్గాలు కోపంతో, ఉక్రోషంతో వున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని వంద అడుగుల లోతులో పాతి పెట్టేయడం ఖాయమని ఆయన అన్నారు. శ్రీలంకలో రాజపక్సే ప్రభుత్వాన్ని తరిమి కొట్టినట్టే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి మిగిలింది దింపుడు కళ్లెం ఆశలే.. అద్భుతాలు జరుతుగుతాయనే భ్రమలు వీడితే మంచిదన్నారు. మూడు రాజధానుల పేరు చెప్పి విశాఖలో 300కోట్లతో విలాసవంతమైన భవనం కట్టారు తప్ప చిన్నపాటి అభివృద్ధి కూడా జరగలేదన్నారు. వైనాట్ 175అంటున్న వైసీపీకి 1,7,5 వీటిలో ఏ నెంబర్ వస్తుందో ప్రజలు తేలుస్తారన్నారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం రావడం చారిత్రక అవసరమన్నారు. ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్స్ కింద పంచిన డబ్బుకు, చేసిన అప్పులకు ఉన్న వ్యత్యాసం ఎక్కడికి పోయింది, ఆ లెక్కల సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు.
Read Also: EX MLA Vishweshwar Reddy: హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌దే..
ధనిక ముఖ్యమంత్రి పేదల పక్షాన పోరాడుతున్నాను అంటే ఈ శతాబ్దపు పెద్ద జోక్ అవుతుందన్నారు. ఉత్తరాంధ్రలో కనీసం నాలుగు సీట్లయిన గెలవగలనని చెప్పగలరా అంటూ ప్రశ్నలు గుప్పించారు. రాజ్యాంగం విధానాలను పాటించకుండా నా రాజీనామాను ఆమోదించినందుకే న్యాయపోరాటం చేస్తున్నానని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి చావు దెబ్బ ఖాయమన్నారు. సీపీఎస్ విషయంలో జగన్‌వి పిల్లి మొగ్గలు వేశారని.. టీడీపీ ఏది చెప్పిన ఖచ్చితమైన అధ్యయనంతోనే మాట్లాడతుందన్నారు. మీ కుటుంబంలో చిచ్చుపెట్టింది మేము కాదు, మీరే పెట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు.