విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పర్యటించారు. జనసేన మండల నాయకులతో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం అవకాశం ఇస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తానన్నారు. జనసేన-టీడీపీతో పొత్తుపై మా అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
లివెందుల టీడీపీ నేత వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్‌సీపీలో చేరారు. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్సార్ సీపీలో చేరారు.
దయచేసి తన కూతురు కృపాలక్ష్మిని మీ బిడ్డగా ఆశీర్వదించాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజలను కోరారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలో నూతన సచివాలయం, పాలశీతలీకరణ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన కూతురిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని పెనమలూరు సీటుపీ టీడీపీలో చిక్కుముడి ఇంకా వీడడం లేదు.
ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో (ఐటీఐ) ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ డా. బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మైలవరం టీడీపీలో పొలిటికల్ రచ్చ జరుగుతోంది. వసంత వర్సెస్ దేవినేనిగా మారిన మైలవరం నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి. పోటా పోటీ కార్యక్రమాల దెబ్బకి టీడీపీ క్యాడర్‌లో హైరానా మొదలైనట్లు తెలుస్తోంది.
టీడీపీని శాసించే స్థాయిలో ఉండి జనసేన 24 సీట్లకే పరిమితం కావడంపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన లేఖలో స్పష్టం చేశారు. రాజ్యాధికారంలో పవన్ కల్యాణ్‌కు దక్కే ప్రాధాన్యత తెలుసుకునేందుకు చంద్రబాబును వివరణ కోరడంలో తప్పేంటంటూ పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు హరిరామ జోగయ్య.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టులో జరిగిన ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇండోనేషియా నుంచి ఓ నౌక బొగ్గు లోడ్‌తో వచ్చింది. నౌకలోని ట్యాంకర్‌ను క్యాజువల్ ఉద్యోగులు క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది.
విజయనగరం జిల్లా బొబ్బిలి గున్నతోట వలస సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం రేపింది. ఆ మృతదేహం బొబ్బిలి పట్టణానికి చెందిన సచివాలయ వాలంటీర్ కిలారి నాగరాజుగా గుర్తించారు.