రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బీసీ భవనంలో గురువారం సాయంత్రం నిర్వహించిన వైసీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి భక్తులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సింహాచలంలోని కేశ ఖండన శాలలో పైకప్పు పెచ్చులు కూలిపడ్డాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశాయి. మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు.
తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ను తొక్కడం కాదు.. పవన్ కల్యాణ్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు.
జనసేన - టీడీపీ ఒప్పందం అయిన తర్వాత జరిగిన మొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెం జెండా సభ అని.. తాడేపల్లిగూడెం సభతో అసలు ఏం సందేశం ఇచ్చారని.. జెండా సభకు జనాలు రాకపోవటంతో ఆలస్యంగా మొదలుపెట్టారని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగుతాయని ఏపీ ప్రభుత్వం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది.
అన్నమయ్య జిల్లా వాల్మీకి పురం వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా ఇవే తన చివరి ఎన్నికలు కావచ్చని.. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానేమో అని ఎంపీ మిథున్ రెడ్డి తన మనస్సులోని మాటను తెలిపారు.