GVL Narasimha Rao: విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పర్యటించారు. జనసేన మండల నాయకులతో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం అవకాశం ఇస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తానన్నారు. జనసేన-టీడీపీతో పొత్తుపై మా అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
Read Also: YSRCP: వైసీపీలోకి పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి
ఈ అయిదేళ్ల కాలంలో శృంగవరపుకోట నియోజకవర్గాన్ని సుమారు పది సార్లు సందర్శించానని.. ఇక్కడ ఉన్న సమస్యలపై పూర్తి అవగాహనతో ఉన్నానన్నారు. ఇటీవల విశాఖ-కిరాండాల్ ఎక్స్ ప్రెస్‌ను శృంగవరపుకోటలో ఆగే విధంగా సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడి ఆ రైలును ఇక్కడ ఆపేలా చేశానన్నారు. పెందుర్తి బొడ్డవర వరకు నాలుగు లైన్ల రోడ్డు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర పధకాల ద్వార జలజీవన్ మిషన్ ద్వారా త్రాగు నీరు, సోలార్ విద్యుత్ వెలుగులు అందిస్తున్నామని, అదేవిధంగా ఇక్కడి స్థానిక నాయకులు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు పూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు.