Yarlagadda Venkat Rao: స్త్రీ శక్తి స్వరూపిణి అని, మహిళలు కన్నెర్ర జేస్తే వైసీపీ గల్లంతవుతుందన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి. గన్నవరంలోని ఏబీ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి తెలుగు మహిళా సమావేశంలో వెంకట్రావుతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమన్న ఆమె.. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఆడ బిడ్డ సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Read Also: YSRCP: పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీ అలర్ట్!
అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడి సీఎం అయిన జగన్.. ప్రజల సంక్షేమం గాలికొదిలిండని మండిపడ్డారు. వైసీపీ పాలనలో దౌర్జన్యాలకు అడ్డూ-అదుపు లేకుండా పోయిందన్న ఆయన మహిళలకు సైతం రక్షణ లేదన్నారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరి పైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన దుర్మార్గులు వైసీపీ నేతలని వారికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదే అని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి రాగానే ప్రతి మహిళను మహాశక్తిగా మార్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ యువతకు 30 వేల ఉద్యోగాలు కల్పిస్తానని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నుంచి 9 నెలల్లో 15 వేల ఇళ్లకు పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు అబద్ధపు హామీలు ఇవ్వటంతో పాటు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారని వారిని నమ్మి మోసపోవద్దన్నారు. టీడీపీ తోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని ఎన్నికలకు పది రోజుల ముందు నుంచి ప్రతి మహిళ ఒక శక్తిలా పని చేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read Also: Election Commission: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఈసీ కీలక హెచ్చరిక..
ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమ, ముల్పూరి సాయి కళ్యాణి, మండవ లక్ష్మి, చిక్కవరపు నాగమణి, మండవ రమ్య, గరికిపాటి నాగలక్ష్మి, పొదిలి లలిత, కంబంపాటి లక్ష్మి, బస్సే సరిత, గుజ్జరలపూడి అజిత, కోనేరు రమణి, చట్టు నాగమణి, వెంకటేశ్వరమ్మ, సుభాషిణి, క్రాంతి, మల్లేశ్వరీ, రాధిక, శాంతమ్మ, వెంకట దుర్గ, సులోచన, దామాయతి, గుడ్డేటి సుమతి, పొట్లూరి జ్యోతి, బేతల ప్రమీల రాణి, వల్లభనేని నాగమణి, చిన్నం శ్రీదేవి, వడ్డీల్లి లక్ష్మి, జనసేన వీరమహిళలు, రూరల్ మండల మహిళా అధ్యక్షురాలు మేకల స్వాతి, సంధ్య, పుణ్యవతి, సగరబోయిన సుభాషిణి, చింతగాళ్లు కుమారి, దుంపల సంధ్యారాణి, తిరుమారెడ్డి సంతోషికుమారి, తదితరులు పాల్గొన్నారు.