ర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది సంఖ్యలో చేనేతలు కలిసి ర్యాలీగా బయలుదేరి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పూలమాలవేసి, అనంతరం చేనేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉద్యోగం చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్షాలు దారుణంగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో విషం చిమ్ముతున్నారన్న ఆయన.. అర్హులను సచివాలయ అధికారులే ఎంపిక చేశారన్నారు.
పొటోషూట్ పేరుతో రప్పించి కెమెరాల ఓ యువ ఫొటోగ్రాఫర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగ మండిపోతున్నాడు. బెజవాడలో ఎండ తీవ్రత పెరిగింది. గతవారం రోజులుగా నిత్యం ఎండ తీవ్రత పెరుగుతూ వస్తోంది.
విశాఖలోని ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భారీ కంటైనర్ పట్టుబడింది. ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాసలో వేకువజామున ఒక కంటైనర్ గంజాయి లోడుతో వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఈబీ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం టీడీపీలో చేరారు. టీడీపీ కండువాతో ఆయనను చంద్రబాబు నాయుడు తమ పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్ది, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా టీడీపీలో చేరారు.
మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన 4వ చివరి సిద్దం మహాసభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సిద్ధం సభ అనంతరం ఎన్నికల ప్రచారం మెుదలవుతుందన్నారు.
పారిశ్రామిక వేత్త వల్లగట్ల రెడ్డప్ప ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త రెడ్డప్పకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి. ఈ చేరిక కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు పాల్గొన్నారు.
ముద్రగడ పద్మనాభం కుటుంబం రాజకీయ భవితవ్యంపై తర్జన భర్జన జరుగుతోంది. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ పెద్దలు టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన ప్రపోజల్పై ముద్రగడ కుమారుడు గిరి తన తండ్రితో చర్చించారని తెలిసింది.
హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరానని తెలిపారు.