Chegondi Suryaprakash: జనసేనకు షాక్.. సీఎం సమక్షంలో వైసీపీలోకి హరిరామజోగయ్య కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chegondi Harirama Jogaiah Son Suryaprakash Joins in YSRCP: జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్‌సీపీలో చేరారు. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్సార్ సీపీలో చేరారు. జనసేన పార్టీలో క్రీయాశీలక సభ్యునిగా జనసేన పొలిటికల్ ఎఫైర్స్ సభ్యుడిగా కీలకంగా వ్యవహరించిన సూర్యప్రకాష్, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి చేస్తున్న పొత్తు రాజకీయంతో విభేధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చిన ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేనాని తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
Read Also: Deputy CM Narayana Swamy: నా కుమార్తెను ఎన్నికల్లో గెలిపించండి..
Also Read
- AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
జనసేన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, మాట్లాడే స్వేచ్ఛ లేదని చేగొండి సూర్య ప్రకాష్ అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ నడపలేని అసమర్థుడు, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ కొమ్ము కాస్తున్నాడన్నారు. చంద్రబాబును, లోకేష్‌ను సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 100 నియోజకవర్గాల్లో కనీసం ఇంఛార్జిన కూడా నియమించలేదన్నారు. జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి చేతిలో పెట్టారని.. జనసేన పార్టీ నమ్ముకున్న బడుగు బలహీన వర్గాలను ముంచేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని విమర్శించారు. ఆరు సంవత్సరాల కాలంలో తనతో కేవలం 30 నిమిషాలు మాత్రమే మాట్లాడారన్నారు. ఆరు ఏళ్లుగా జనసేన పార్టీ కోసం పని చేశానన్నారు.
కేవలం ముగ్గురు మాత్రమే స్టేజ్ పై కూర్చుని ఉంటారని.. ఎవరైనా ప్రశ్నిస్తే వైసీపీ కోవర్టులు అని పవన్ కళ్యాణ్ అంటున్నారన్నారు. మనసు చంపుకుని జనసేనలో ఉండలేక… బయటికి వచ్చానన్నారు. జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉందన్నారు. వైసీపీకి, జగన్ కు ఏమి ఆశించకుండా చేదోడువాదోడుగా ఉంటానన్నారు. బేషరతుగా వైసీపీ పార్టీలో చేరానన్నారు.
తాజావార్తలు
-
DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..