* శ్రీహరికోట: నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్-3.. శ్రీహరికోట నుంచి దూసుకెళ్లనున్న ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్.. మధ్యాహ్నం 2.35 గంటలకు ముహూర్తం.
*నేడు న్యూయార్క్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాల్లో ప్రసంగించనున్న కిషన్ రెడ్డి
*నేడు రెండో రోజు ఫ్రాన్స్‌లో ప్రధాని మోడీ పర్యటన.. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని.. రాఫేల్ విమానాల కొనుగోలు ప్రకటన!.. ఇప్పటికే డీఏసీ ఆమోదం
*పశ్చిమగోదావరి జిల్లా: తణుకులో నేడు వారాహి విజయ యాత్ర బహిరంగ సభ.. సాయంత్రం 5 గంటలకు సభలో ప్రసంగించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..
*నేడు తిరుపతిలో ఏపీ గవర్నర్ పర్యటన.. జాతీయ సంస్కృత యూనివర్సిటీలో జరుగుతున్నవ ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
*అనంతపురం : నేటితో ముగియనున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు.