AP CM Jagan: చంద్రయాన్- 3 ప్రయోగం.. ఇస్రో బృందానికి సీఎం జగన్ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Jagan: భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోట కేంద్రం నుంచి శుక్రవారం (జూలై 14) చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు. ఈ చంద్ర మిషన్ 2019 సంవత్సరం చంద్రయాన్ 2 తదుపరి మిషన్. భారతదేశం ఈ మూడవ మిషన్‌లో, శాస్త్రవేత్తలు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ ‘సాఫ్ట్ ల్యాండింగ్’ లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘చంద్రయాన్-2’ మిషన్ సమయంలో చివరి క్షణాల్లో ల్యాండర్ ‘విక్రమ్’ మార్గం విచలనం కారణంగా ‘సాఫ్ట్ ల్యాండింగ్’ చేయలేకపోయింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రాజెక్ట్ ఎల్వీఎం3ఎం4 రాకెట్‌తో శుక్రవారం అంతరిక్షంలోకి వెళ్లనుంది.
చంద్రయాన్–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్ధంగా ఉంజి. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు రాకెట్ దూసుకెళ్లనుంది. చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇస్రో బృందానికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. శ్రీహరి కోట నుండి చంద్రయాన్- 3 ప్రయోగంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చందమామపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
Also Read: Chandrayaan-3: నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్-3
ఈ మిషన్ విజయవంతమైతే అటువంటి ఘనత సాధించిన అమెరికా, చైనా, మాజీ సోవియట్ యూనియన్ వంటి దేశాల క్లబ్‌లో భారతదేశం చేరుతుంది. ‘చంద్రయాన్-3’ కార్యక్రమం కింద ఇస్రో చంద్రుని ఉపరితలంపై ‘సాఫ్ట్-ల్యాండింగ్’, చంద్ర భూభాగంలో రోవర్ రొటేషన్‌ను దాని చంద్ర మాడ్యూల్ సహాయంతో ప్రదర్శించడం ద్వారా కొత్త సరిహద్దులను దాటబోతోందని అంతరిక్ష సంస్థ తెలిపింది. చంద్రయాన్–3 మిషన్‌ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం–3 సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!