‘జగనన్న సురక్ష’ కార్యక్రమం రాష్ట్రంలో రికార్డు సృష్టిస్తోంది. అర్హత ఉండి కూడా రాష్ట్రంలో ఎవరూ ప్రభుత్వ పథకాలు అందకుండా ఉండకూడదన్న మహోన్నత లక్ష్యంతో ప్రభుత్వం ‘జగనన్న సురక్షా’ కార్యక్రమాన్ని జులై 1న లాంఛనంగా ప్రారంభించింది.
మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. తాజాగా వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. ఈ నెల 20న పవన్‌కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు చెప్పారు.
విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలులో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణ హత్య కేసులో నిందితుడు వెంకటనాయుడు ఇంటిపై మృతుడి బంధువులు దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
శ్రీవాణి ట్రస్ట్ కి ఇప్పటి వరకు 880 కోట్లు విరాళాలు అందాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామన్నారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కమిటీల బలోపేతంపై చర్చించారు. కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై సమీక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశంలో ప్రసంగించారు. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయన్న పురంధేశ్వరి.. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్నారు. ప్రతి కార్యకర్త సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఈరోజు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
ఆ తల్లి ఎన్ని ఆశలు పెట్టుకోందో... నవమాసాలు మోసి తల్లికి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంతోషం ఎక్కువ సేపు నిలువలేదు ...కన్న బిడ్డలను కళ్ళారా చూసుకునేలోపు పుట్టిన ముగ్గురు పిల్లలు అనారోగ్యంతో మరి చెందడం అత్యంత విషాదాన్ని అకుటుంబంలో నింపింది.