AP CM Jagan: రాష్ట్రంలో ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సమస్యలపై చర్చ చేపట్టినట్లు తెలుస్తోంది. విద్యా రంగంలో జరుగుతున్న కీలక మార్పులపై వైస్ ఛాన్సలర్లతో సీఎం జగన్ ఈ సమావేశంలో చర్చించారు.
Also Read: Purandeshwari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరి
బోధన, నైపుణ్యాభివృద్ధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుసంధానంపై సీఎం కీలక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్‌మెంటేషన్ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. అదే సమయంలో ఈ రంగాల్లో క్రియేటర్లుగా విద్యార్థులను తయారు చేయడంపై దృష్టి సారించినట్లు సమాచారం. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పుల కోసం సీఎం అడుగులు వేస్తున్నారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మత్రి బొత్స సత్యనారాయణ, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఉన్నత విద్యా శాఖ అధికారులు హాజరయ్యారు.