నా ఇంటిలో ఒక విచిత్ర పరిస్థితి.. నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలి.. కానీ, వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ.. మైన్ను తన పేరు మీద మార్చాలని వాణి ఒత్తిడి చేసేది.. క్వారీ వద్దకు వెళ్లి డబ్బులన్నీ తనకే ఇవ్వాలంటూ రచ్చ చేసిది అన్నారు..
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రానికి ఒక్క ఫ్యాక్టరీ రాలేదు కదా.. రాష్ట్రంలోని 8 ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లాయని ఆరోపించారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. వైసీపీలో ఐదు సంవత్సరాలు పాటు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాని హాట్ కామెంట్లు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుతున్నాయి.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ వాక్ థాన్ జరిగింది.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి అనిత.. సైబర్ సోల్జర్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్…
ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ (APNTF) విభాగం ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభమైంది.. డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలను మిషన్ ఆఫ్ ద ఏపీ అని పేర్కొంటోంది ఆంధ్ప్రదేశ్ ప్రభుత్వం.. ఏడీజీ లేదా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో APNTF ఏర్పాటు చేయనున్నారు.. రాజధానిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్.. 26 జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోస్ సెల్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది కూటమి సర్కార్.
ఆస్తులు లేని వ్యక్తిని ప్రేమించి, తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నాను.. కానీ, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు అన్నారు టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి..
ఎన్టీవీతో మాట్లాడిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. మాది ముప్పై ఏండ్ల వైవాహిక జీవితం. గత రెండేళ్లుగా తీవ్రవిభేదాలు నడుస్తున్నాయి.. ప్రతి రోజూ మా ఇంటిలో గొడవలే. నా భార్యకు ఉన్న రాజకీయం కాంక్ష , ఆధిపత్యపోరే దీనికి కారణంగా చెప్పుకొచ్చారు.. నేనే ఎమెల్యే కావాలి, బిజినెస్ నాపేరున ఉండాలి అనేది ఆమె వైనంగా పేర్కొన్న ఆయన.. పెళ్లి అయిన ఒకటి రెండు ఏళ్లకే ఇది మొదలైంది అని ఆవేదన వ్యక్తం…
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా నడుస్తుంది. గత రెండు రోజులుగా దువ్వాడ సతీమని వాణి, ఆమె కుమార్తెలు తమ తండ్రి, ఎమ్మెల్సీ దువ్వాడ తీరును తప్పు బడుతు రచ్చకెక్కారు. దీంతో శ్రీనివాస్ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డున పడింది. టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంటున్న ఆయన ఇల్లు , కార్యాలయం వద్దకు కుమార్తెలు రావడం ఆయన తలుపులు తీయకపోవడంతో విషయం రచ్చకెక్కింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, శుక్రవారం రాత్రి మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్..