హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకెళ్తాం.. గ్రామ ప్రజలను కాపాడుకుంటాం అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు రాకుండా ఆపగలిగారు.. అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిదర్శనం ఇదే అన్నారు..
ఆంధ్రప్రదేశ్‌కి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు మంజూరు చేసింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90 కోట్లను మంజూరు చేసిందని.. ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో బిగ్ షాక్ తగిలింది.. పార్టీకి, పార్టీ పదవులకు కీలక నేత గుడ్‌బై చెప్పేశారు.. గోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జి పదవితోపాటు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు.
Minister TG Bharath: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులోని జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన పరిశ్రమను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పూర్తవ్వలేదు అన్నారు.
Duvvada Haindavi: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె.. హైందవి ఎన్టీవీతో మాట్లాడుతూ.. మాకు మా డాడి కావాలి.. మేం మా నాన్నతోనే ఉండాలనుకుంటున్నామన్నారు. మా నాన్నకు చాలా సార్లు చెప్పాం.. మా మంచి చెడు డాడీకి తెలుసు.. ఆయన మరో మహిళ ట్రాప్ లో పడ్డారు..
MLC Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో మరోసారి ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కుతుంది. గత రెండేళ్లుగా కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో వేరు వేరుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య జేడ్పీటీసీ దువ్వాడ వాణి ఉంటున్నారు.
Chandrababu: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు.
Minister Satya Kumar: నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు ఆసుపత్రికి ఆరు డయాలసిస్ యూనిట్లు లయన్స్ క్లబ్ ఇవ్వడం ఆనందంగా ఉంది.
YCP Leaders Protest: బెజవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైసీపీ నేతలు నిరసన చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ నిరసన తెలిపారు.