Home Minister Anitha: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత. కర్నూలులో టీడీపీ నేత హత్య కేసులో నిందితులు ఎంతటి వారైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎస్పీతో రెండు సార్లు సమీక్షించానని.. అగంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నాలుగు రాజకీయ హత్యలు జరిగితే అందులో ముగ్గురు టీడీపీ నాయకులు ప్రాణాలు కోల్పాయరని ఆవేదన వ్యక్తం చేశారు.. పెద్దల సభకు మచ్చ తెచ్చే విధంగా కొందరు ఎమ్మెల్సీలు ప్రవర్తన ఉంటుందని విమర్శించారు. డ్రైవర్ ను డోర్ డెలివరీ చేసిన వాళ్లు, ఫ్యామిలీ గొడవలతో రచ్చ చేసుకునేవాళ్లు ప్రజాప్రతినిధులు అంటే జనానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నామో చెప్పాలి.. అటువంటి వ్యక్తులను సభకు పంపించిన పార్టీ ఆలోచన చేసుకోవాలి అంటూ హితవు పలికారు హోం మంత్రి వంగలపూడి అనిత.
Read Also: YSRCP: జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసిన వైసీపీ బృందం.. విజయవాడ ఘటనపై ఫిర్యాదు
కాగా, కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూర్ గ్రామంలో దారుణ హత్య జరిగింది.. హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్యకు గురయ్యారు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసులను దుండగులు ముందే పథకం ప్రకారం కళ్ళలో కారం కొట్టి వేట కొడవళ్లతో అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో హోసూర గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మాజీ సర్పంచ్ పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబుకి ప్రధాన అనుచరుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హోసూరు గ్రామంలో టీడీపీకి మంచి మెజార్టీ రావడం తర్వాత ఈ హత్య జరగడంతో రాజకీయంగా మరే ఇతర కారణాలతో హత్య జరిగి ఉంటుందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్య జరిగిన స్థలాన్ని ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. క్లూస్ టీం, ఆధారాలనుసేకరించారు. డాగ్ స్క్వాడ్, హత్య జరిగిన ప్రదేశం నుండి హత్య అయిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్లితిరిగి హత్య ప్రదేశానికి డాగ్ స్క్వాడ్ చేరుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రంలోపు నిందితులను పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాచర్యలు తీసుకుంటామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.