Vijayawada Traffic: రేపు ఉదయం 9 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం విజయవాడలో జరిగే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు సహా మంత్రులు, ఇతర ముఖ్య అతిధులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ను ప్రజల సౌకర్యార్థం వివిధ మార్గాలలో దారి మళ్ళించడం జరుగుతుందన్నారు.
Read Also: Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం.. అసలేమైందంటే?
ప్రజలకు సూచనలు:
1. ఉదయం 7 గంటల నుంచి కంట్రోల్ రూమ్ వైపు నుంచి బెంజ్ సర్కిల్ వైపుకు వెళ్ళే అన్నీ వాహనములను.. ఆర్టీసీ వై జంక్షన్ నుంచి ఏలూరు రోడ్ మీదుగా స్వర్ణ ప్యాలస్, దీప్తి సెంటర్ చుట్టుగుంట – గుణదల – రామవరప్పాడు రింగ్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపుకు మళ్లింపబడ్డాయని పేర్కొన్నారు.
2. బెంజ్ సర్కిల్ వైపు నుంచి బందర్ రోడ్ లోనికి వచ్చే వాహనములను బెంజ్ సర్కిల్ నుంచి ఫకీర్ గూడెం– స్క్యూ బ్రిడ్జ్- నేతాజీ బ్రిడ్జ్- బస్టాండ్ వైపుకి మళ్ళించడం జరుగుతుంది.
3. రెడ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్, శిఖామణి సెంటర్ నుంచి వెటరినరీ జంక్షన్ వరకు ఏ వాహనాలకు పర్మిషన్ లేదని తెలిపారు.
4. బెంజ్ సర్కిల్ నుంచి డీసీపీ బంగ్లా కూడలి వరకు ( యంజీ రోడ్ నందు) ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆహ్వానితులకు మాత్రమే అనుమతింపబడుతుందని పోలీసులు సూచించారు.
Read Also: Vinesh Phogat Verdict: వినేశ్ ఫోగట్ రజత పతకంపై డబ్ల్యూఎఫ్ఐ బిగ్ న్యూస్..
ఇక, ఆర్టీసీ సిటీ బస్సులు మళ్లింపుల మార్గము:
1. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ “వై” జంక్షను నుంచి బెంజ్ సర్కిల్ వైపుకు బస్సులు అనుమతించబడవు..
2. ఆర్టీసీ “వై” జంక్షను నుంచి బండరు రోడ్డు- రూట్ .నెం.5లో వెళ్ళు సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ వరకు వెళ్ళి అక్కడ నుంచి బెంజ్ సర్కిలు వైపుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఆహ్వానితులకు ప్రత్యేక సూచనలు
“AA, A1, A2, B1, B2”పాస్ కలిగిన ఆహ్వానితుల సౌకర్యార్దం.. వారి వాహనములు ఇందిరా గాందీ స్టేడియంకు వచ్చు మార్గములు, ప్రవేశించే ద్వారములు, పార్కింగ్ ప్రదేశములు ఈ క్రింది విధంగా కల్పించడమైనది అని పోలీసులు సూచించారు.
1.’’AA పాస్’’కలిగిన వారు గేట్ నెంబర్ 3 (ఫుడ్ కోర్ట్) నుంచి ప్రవేశించి అక్కడే నిర్దేశించబడిన స్థలములో వాహనాలు పార్కింగ్ చేయవలెను.
2. “A1, A2 ” పాస్ కలిగిన వారు గేట్ నెంబర్ 4 (మీ సేవ వద్ద ఉన్నది) ద్వారా లోపలికి ప్రవేశించి వారి వాహనములను హ్యాండ్ బాల్ గ్రౌండ్ నందు పార్కింగ్ చేయవలెను.
3. “B1, B2- పురస్కార గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు ” పాస్ కలిగిన వారు గేట్ నెంబర్ 2 ద్వారా ప్రవేశించి ఫుట్ బాల్ గ్రౌండ్ నందు లేదా స్టేడియం ఎదురుగా ఉన్న ఆర్మేడ్ రిజర్వు గ్రౌండ్ నందు పార్క్ చేయవలెను..
4. స్కూల్ విద్యార్ధులు, ఇతర ఆహ్వానితులు వాటర్ ట్యాంక్ రోడ్డులోని గేటు నెంబర్ 6, 7 ద్వారా ప్రవేశించవలయును.
5. మీడియా- పాత్రికేయులు గేట్ నెంబర్ 2 ద్వారా స్టేడియం లోపలికి అనుమతించబడును.. వీరు తప్పనిసరిగా ఫోటో ఆక్రిడేషన్ కార్డు కానీ ఫోటో ఐడి కలిగిన కార్డ్ తో లోపలికి రావాలని పోలీసులు విజ్నప్తి చేశారు.
6. పాసులు కలిగిన ఆహ్వానితులు ఉదయం 8 గంటలలోపు స్టేడియం వద్దకు చేరుకోవాలి అని విజయవాడ నగర పోలీసులు కోరారు.