Murder Case: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మల్కిపురం (మం) మలికిపురం గ్రామానికి చెందిన పడమటి నోబుల్ జార్జ్ గుడిమెల్లంక గ్రామానికి చెందిన భర్తను వదిలేసిన రాపాక ప్రశాంతి (వివాహిత)తో ప్రేమలో పడి గత కొంతకాలంగా సహజీవనం కొనసాగించారు. గంజాయికి బానిసైన నోబుల్ జార్జ్.. ప్రశాంతిని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని తన అన్న రాపాక ప్రకాష్ కు చెప్పిన ప్రశాంతి.. ఈ నెల 9వ తేదీన కాకినాడలో ఉంటున్న నోబుల్ జార్జ్ ని పథకం ప్రకారం దిండికి రప్పించింది.. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో రాపాక ప్రశాంతి, ఆమె అన్న ప్రకాష్, స్నేహితుడు ఎర్రంశెట్టి ప్రేమ్ కుమార్ తో కలిసి ఇనుప రాడ్లతో నోబుల్ జార్జ్ ను కొడుతుండటంతో.. వారి దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయే సమయంలో కాకినాడలో ఉన్న తన తండ్రికి జార్జ్ ఫోన్ చేసి తాను ప్రమాదంలో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడని పేర్కొన్నారు.
Read Also: Best Wife – Best Husband: ఉత్తమ భార్యగా శ్రీవాణి.. ఉత్తమ భర్తగా దివ్వెల మహేష్!
అయితే, పారిపోతున్న నోబుల్ జార్జిని పట్టుకుని ఇనుప రాడ్లతో కొట్టి ప్రాణం మీదికి ఉండగానే దిండి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి విసిరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చెప్పులు, మోటార్ సైకిల్ బ్రిడ్జిపై ఉంచి ముగ్గురు నిందితులు పారిపోయారు. ఈ నెల 10వ తేదీన నోబుల్ జార్జ్ తండ్రి రత్న రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కాగా, నిన్న ( మంగళవారం) అంతర్వేది సముద్రం తీరాన లభ్యమైన నోబుల్ జార్జ్ మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. సూసైడ్ కాదని ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని నిర్ధారణ చేసి కేసు నమోదు చేశారు.