Women Protest: పల్నాడు జిల్లాలో ఓ మహిళ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తుంది.. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని కొంత మంది ఆక్రమించుకున్నారని అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పొలంలో ఆమరణ దీక్షకు దిగింది.
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పనికి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుండగా.. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అందుకు సంబంధించిన సమాచాారాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన లాంఛనంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయితీలకు అందించే నిధుల విషయంలో కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం ఖర్చుల కోసం ఏటా ప్రభుత్వం చిన్న గ్రామ పంచాయతీలకు రూ.100, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.250 ఇచ్చేదని.. గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇంతే మొత్తంలో నిధులు ఇచ్చేదని పవన్ తెలిపారు.
అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలుపరుస్తాం అన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కలెక్టరేట్లో మైనింగ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నిటిని భ్రష్టు పట్టించింది.. మద్యం పాలసీ సైతం భ్రష్టు పట్టిందని ఫైర్…
ప్రియుడి మోజులో పడ్డ ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. ఆపై హత్యను.. చాకచక్యంగా ఆత్మహత్యగా చిత్రీకరించి అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, అంతా ఆత్మహత్యగా భావించినా.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆగస్టు 3వ తేదీన జరిగిన హత్యను పోలీసులు అత్యంత చాకచక్యంగా చేధించారు పోలీసులు..
ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట.. వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను ఇటీవలే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపిన ఆయన.. గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.. గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా టీడీపీ అధినేత, సీఎం…
రాజకీయ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. రాజకీయ నాయకుడు ఎప్పుడూ ప్రజల కష్టనష్టాలు తెలుసుకొని సానుకూలంగా స్పందించాలన్నారు.. ప్రజా నాయకుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి.. అప్పుడే మన వద్దకు వచ్చే కార్యకర్తలు, ప్రజలు సమస్యలను చెప్పుకోగలరు అన్నారు..