Vaibhav Sooryavanshi: క్రికెట్ స్టార్ వైభవ్ సూర్యవంశీకి కొత్త ఛాలెంజ్.. పరీక్ష హాల్లోకి అడుగు పెట్టబోతున్న యువ ప్లేయర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్య వంశీ.. ఈ పేరు ప్రపంచ క్రికెట్‌లో మారుమోగుతోంది. 14 ఏళ్ల కుర్రాడు క్రికెట్ చరిత్రలో నూతన అధ్యాయాలు లిఖిస్తున్నాడు. అంతర్జాతీయ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భారత్‌కు ఆరవ టైటిల్ అందించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. ఈ కుర్రాడు క్రికెట్‌ను వదిలి కొన్ని రోజులు పుస్తకాలకు అంకితం కానున్నాడు. ఎందుకంటే.. దగ్గర్లో పరీక్షలు ఉన్నాయి. ఇంతకీ వైభవ్ ఎన్నో తరగతో తెలుసా? జస్ట్ పదో తరగతే. ఇప్పుడు తన 10వ తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నాడు వైభవ్. క్రికెట్ మైదానంలో వెలుగులు విరజిమ్మిన అతను, ఇప్పుడు విద్యా మైదానంలో తన ప్రతిభ చూపడానికి రెడీ అయ్యాడు.
READ MORE: Roshan-Emo Emo Idi : ‘ఏమో ఏమో ఇది’ అంటూ మొదలైన రోషన్ కొత్త.. ప్రేమాయణం!
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
అయితే.. బీహార్‌లో ఫిబ్రవరి 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ అంశంపై సమస్తిపూర్‌లోని పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ నీల కిశోర్ మాట్లాడుతూ.. వైభవ్ సాధారణ విద్యార్థిలాగే పరీక్షలు రాయనున్నాడని చెప్పారు. అతనికి అడ్మిట్ కార్డు వచ్చిందని, స్కూల్‌లో అందరూ అతని రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. అయితే ప్రత్యేక సౌకర్యాలు ఏవీ ఉండవని, అందరికీ ఉన్న సదుపాయాలే వైభవ్‌కు ఉంటాయని స్పష్టం చేశారు. “ఇది క్రికెట్ పిచ్ కాదు, చదువు పిచ్” అని ఆయన చెప్పిన మాట అందరినీ ఆకట్టుకుంది.
READ MORE: Iran Video: ‘‘ఖమేనీ డెత్’’ అంటూ నోరు జారిన రిపోర్టర్.. టీవీ ఛానల్స్ సిబ్బంది తొలగింపు
వైభవ్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రపంచకప్ ఫైనల్లో వైభవ్ 175 పరుగుల ఇన్నింగ్స్ ప్రత్యేకంగా నిలిచింది. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో ఆడిన ఆ ఇన్నింగ్స్ అండర్-19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డుగా నిలిచింది. ఈ టోర్నీలో మొత్తం 439 పరుగులు చేసి రెండో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఒక శతకం, మూడు అర్ధశతకాలు సాధించి తన సత్తా చాటాడు. మొత్తం 30 సిక్సులు కొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. అండర్-19 వన్డేల్లోనూ వైభవ్ ప్రదర్శన అద్భుతం. ఇప్పటివరకు 25 ఇన్నింగ్స్‌లో 1,412 పరుగులు చేశాడు. సగటు 56కి పైగా, స్ట్రైక్ రేట్ 165కి పైగా ఉంది. నాలుగు శతకాలు, ఏడు అర్ధశతకాలు సాధించాడు. అతని అత్యధిక స్కోర్ 175 పరుగులే. అయితే.. ఇప్పడు చదువు పరీక్షలో నెగ్గుతాడా? లేదా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!