Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. ఐఏఎస్, ఐపీఎస్‌లు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి.. ఇదే సమయంలో మరికొందరిని వెయిటింగ్‌లో పెట్టింది ప్రభుత్వం.. అయితే, వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్‌లో ఉంటూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్‌లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.. వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకాలు చేయాలని సీనియర్ ఐపీఎస్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు..
Read Also: Google Pixel Buds Pro 2: గూగుల్ పిక్సెల్ నుంచి బడ్స్, వాచ్.. ధర, ఫీచర్లు ఇవే!
మొత్తం 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఇక, వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్‌ల విషానికి వస్తే.. పీఎస్సార్, సునీల్ కుమార్, సంజయ్, కాంతి రాణా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని ఉండగా.. సీనియర్ ఐపీఎస్‌లు రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, రఘువీరా రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, జాషువా, కృష్ణ కాంత్ పటేల్, పాలరాజు కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న విషయం విదితమే..