విజయనగరం ఎంపీగా తొలిసారి గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు నిత్యం ప్రజల్లో ఉండాలని అనుకోవడం వరకు బాగానే ఉందిగానీ... అందు కోసం ఆయన చేస్తున్న స్టంట్స్ పరువు తీసేస్తున్నాయన్న టాక్ బలంగా ఉందట నియోజకవర్గంలో. చిన్నచిన్న విషయాలను సాతం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పడుతున్న తాపత్రయంతో మొత్తం బూమరాంగ్ అవుతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి.
తిరుమలలో రోండోవ పెళ్లికి సిద్దపడిన భర్తను అడ్డుకుంది వరంగల్ కి చెందిన సంధ్య అనే మహిళ.. విడాకులు తీసుకోకూండానే రెండో పెళ్లి చేసుకుంటున్న భర్త రాకేష్ పై పోలీసులుకు పిర్యాదు చేసింది భార్య సంధ్య. దీంతో.. పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు పోలీసులు.. ఇక ఊహించని ఘటనతో షాక్ తిన్న భర్త రాకేష్.. అక్కడ నుంచి సైలెంట్‌గా జారుకుని పరారైయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట కారులో నిరీక్షిస్తున్నారు టెక్కలి జడ్పీటీసీ, శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి.. అయితే, గత రాత్రి కుమార్తెలు నిరీక్షించి.. దువ్వాడ శ్రీనివాస్‌ను కలిసేందుకు చేసిన ప్రయత్నం విఫలం కాగా.. ఈ రోజు ఆయన భార్య కూడా వచ్చారు..
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలు.. ఆయన కామెంట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కక్ష్యలు, కేసులు, వేధింపులు, హత్యలకు మారుపేరు ‘‘జగన్ రెడ్డి’’గా పేర్కొన్న ఆయన.. రెంటు కుటుంబాల మధ్య ఘర్షణను ప్రభుత్వంపై అంట గట్టాలని జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు..
రాష్ట్రంలో విత్తన కొరత లేదు.. వైసీపీ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోకండి అంటూ వైఎస్ షర్మిలకు సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు.. గత ఐదేళ్ల అన్న పాలనలో రైతుల బాధలు కనపడకపోవడం బాధాకరమన్న ఆయన.. రాజకీయాల కోసం అటు అన్న, ఇటు చెల్లెలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారింది.. దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వల మాధురి అనే మహిళతో ఎఫైర్ ఉందంటూ శ్రీనివాస్ భార్య వాణి చేసిన ఆరోపణలపై అదే రేంజ్లో స్పందించారు దివ్వల మాధురి.. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. నన్ను అనవసరంగా బయటకు లాగొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. శ్రీనివాస్ భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిధులను భారీగా పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.. గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు..