పల్నాడు ప్రాంతం పర్యాటకులతో పోటు ఎత్తుతుంది. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ద్వారా దిగువ ప్రాంతానికి భారీగా వరద నీరు వదలడంతో.. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. గడిచిన కొద్దీ రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు హాజరవుతున్నారు. నేడు ఆదివారం కావడంతో హైదరాబాద్ నుండి కూడా.. పెద్ద ఎత్తున పర్యాటకులు నాగార్జునసాగర్ సమీపంలోని సుందర జలపాతాలను సందర్శిస్తున్నారు.
విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. 5వ అంతస్తు అడ్మిన్ బ్లాక్లో మొదలైన మంటలు.. ఇతర బ్లాకుల్లోకి వ్యాపించాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న పేషంట్లకు ఇబ్బంది తలెత్తకుండా ఆస్పత్రి సిబ్బంది చర్యలు చేపట్టారు.
Vizag MLC Election: విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై కూటమి నేతల కీలక సమావేశం అయింది. ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించనున్న అధిష్ఠానం నియమించిన కమిటీ.. ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన నివేదిక ఆధారంగా పోటీపై ఎన్డీయే కూటమి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.
Anam Ramanarayana Reddy: ఏపీ సచివాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించారు. బ్లాక్-2లోని తన ఛాంబర్లో పూజలు చేసిన వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలిచ్చారు.
CM Chandrababu: తుంగభద్ర డ్యాం కొట్టుకుపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. కర్ణాటక ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేలుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మూడో రోజు హైడ్రామా కొనసాగుతుంది. దువ్వాడ ఇంటి ముందు రాత్రిపూట కార్ షెడ్ లోనే భార్య వాణి, కుమార్తె హైందవి పడుకున్నారు.
Payyavula Keshav: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయిన విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన మంత్రి పయ్యావుల కేశవ్..