ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఏపీ మంత్రివర్గంలో చోటుదక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
బట్టలు ఆరేస్తుండగా జరిగిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.. ఒకేసారి ఏకంగా ముగ్గురు మృతి చెందారు.. తల్లి, ఇద్దరు పిల్లలు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మారింది..
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళా సైబర్ నేరగాళ్ల బారినపడింది. వేటపాలెం మండలం కటారివారిపాలెం కు చెందిన కాటంగారి అనిత.. చిరు వ్యాపారి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నాలుగు లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా వుండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తనకూతురుకి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున కూతురు తెలిసో.. తెలియకో.. అందులోని సైబర్ నేరగాళ్ల పంపిణి ఓ లింక్ ను…
శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయ సమీపంలోని కొండపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.. ఆమెను గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెన్నెలగా గుర్తించారు.. ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది..
టమోటా ధర భారీగా పతనం అయ్యింది.. దీంతో.. రైతుల్లో ఆందోళన మొదలైంది.. బహిరంగ మార్కెట్ ప్రస్తుతం కిలో 20 నుంచి 30 రూపాయల వరకు పలుకుతుండగా.. ఒకేసారి భారీగా పతనమైంది.. టమోటా మార్కెట్కు పెట్టింది పేరైన కర్నూలు జిల్లాలోని పత్తికొండ టమోటా మార్కెట్లో ఈ రోజు కిలో టమోటా ధర ఒక్క రూపాయికి పడిపోయింది..
మరోసారి.. అంటే ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. కానీ, తాజాగా తేదీలను మార్చేసింది.. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
వైజాగ్లో డ్రగ్స్ వ్యవహారం అప్పట్లో కాకరేపింది.. అయితే, విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై నేను మళ్లీ కేంద్రానికి లేఖ రాస్తున్నాను అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తాను అన్నారు.. కేంద్ర దర్యాప్తు సంస్థలు మేనేజ్కు గురైతే మన పరువు పోతుందన్నారు.. అందుకోసం సిట్ రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని లేఖ రాస్తానని వెల్లడించారు.
సిట్ తో పేదల బియ్యం మాఫియా ఆగడాల ఆటకట్టు అన్నారు ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్.. మీడియాతో మాట్లాడిన ఆయన.. కాకినాడ పోర్టులో కూలీలకు పని కల్పించడం అంటే అక్రమ అవినీతి బియ్యం వ్యాపారంతో కాదు.. సక్రమమైన ఎగుమతులు - దిగుమతుల వ్యాపారంతో అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవుచెప్పారు.. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆకలి తీర్చాలని రెట్టింపు బియ్యం ఇస్తే, కాకినాడ పోర్టు నుండి రెట్టింపు బియ్యం…
దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు పొడిగించింది.. గతంలో ఇచ్చిన ఆదేశాలను మళ్లీ శుక్రవారం వరకు పొడిగిస్తూ ఆదేశాలిచింది.. ఇక, ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ జరపనుంది ఏపీ హైకోర్టు..