AP Capital: ముగిసిన సీఆర్డీఏ సమావేశం.. కీలక నిర్మాణాలకు అనుమతి..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం..
- అమరావతిలో కీలక నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన సీఆర్డీఏ..
- లే ఔట్‌లు, ట్రంక్ రోడ్లు, హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్‌లు, ఐకానిక్ టవర్లకి అనుమతి..
- ఇవాళ రూ.24,276.83 కోట్లకు సంబంధించిన పనులకు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Capital: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.. అమరావతి రాజధాని నిర్మాణాలపై చర్చించి.. పలు కీలక నిర్మాణాలకు ఆమోదం తెలిపింది రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ)సమావేశం.. ఇక, సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. సీఆర్డీఏ సమావేశంలో ఆమోద ముద్రపడిన ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు..
Read Also: Prakasam Crime: పిల్లను ఇచ్చి పెళ్లి చేశారు.. ఊరికే కన్నం వేసిన దొంగ అల్లుడు..!
Also Read
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
అమరావతిలో లే ఔట్‌లు, ట్రంక్ రోడ్లు, హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్‌లు, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అథారిటి అనుమతిచ్చింది అని తెలిపారు మంత్రి నారాయణ.. ఇవాళ 24,276.83 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు అనుమతులిచ్చింది.. మొత్తం ఖర్చు 62 వేల కోట్లు ఖర్చు అంచనాలో ఇప్పటి వరకూ 45,249.24 కోట్లకు అనుమతులు లభించినట్టు వెల్లడించారు.. అసెంబ్లీ బిల్డింగ్ 11.22 లక్షల చదరపు అడుగులు, 250 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతందన్న ఆయన.. ఐదు టవర్లు… జీఏడీ టవర్ కు 47 ఫ్లోర్లు ఉంటాయి.. 17,03,433 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మాణం ఉంటుందన్నారు.. టవర్ 1 నుంచి 4 వరకు 68,88,064 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మాణం జరుగుతందన్నారు.. ఈ టవర్లకు 4685 కోట్లు ఖర్చు అవుతుంది.. రోడ్ల నిర్మాణానికి అన్ని హంగులతో 579.5 కిలోమీట్లర్లు చేపట్టనున్నాం.. దీనికి రూ.9,695 కోట్ల ఖర్చు చేయనున్నాం అన్నారు. ఇక, ట్రంకు రోడ్లు 151.9 కిలోమీటర్లకు రూ.7,704 కోట్లకు అనుమతిచ్చారు.. STP ప్లాంటుకు రూ.318.15 కోట్లు అనుమతి లభించిందని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి పొంగూరు నారాయణ..
Read Also: TG Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలు ప్రకటన
ఇక, గత ప్రభుత్వం చేసినవి సరిదిద్దుకోవడానికి ఇంతవరకూ సమయం పట్టింది.. ప్రభుత్వ భవనాల రేట్లు 41 శాతం పెరిగాయి.. సీఆర్డీఏ రేట్లు కావు ఇవన్నీ… వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదు అని హెచ్చరించారు నారాయణ.. డిసెంబర్ నెలాఖరుకు చాలా టెండర్లు పూర్తవుతాయి… మిగిలిన టెండర్లు కూడా జనవరి నెలాఖరులోగా పూర్తవుతాయి. పాత టెండర్లు ముగింపు ప్రక్రియ పూర్తవుతోంది.. అవగానే కొత్త టెండర్లు పిలుస్తాం.. E11, E13, E15 రోడ్లు పరిశీలించి వచ్చాం… ఉండవల్లి, పెనుమాక రైతులతో మాట్లాడుతున్నాం.. వెస్ట్రన్ బైపాస్ రోడ్డు రెండు చోట్ల దిగేలా సింగపూర్ వాళ్ళు ప్లాన్ ఇచ్చారు.. E5 దగ్గర వెస్ట్రన్ బైపాస్ దిగేలా చూస్తున్నాం… 29 గ్రామాల్లో ప్రతీ గ్రామంలో సమానంగా ఉపాధి అవకాశం కల్పించేలా ఏర్పాటు చేసాం.. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా ఉందన్నారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?