Collectors Conference: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు, రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఆరు నెలల ఎన్డీయే ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్-2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
ఓవైపు కేసుల భయం, మరోవైపు ఏం మాట్లాడినా ఇరుక్కుంటామన్న ఆందోళనతో ఇప్పుడు రోజా డైవర్షన్ కోసం చూస్తున్నట్టు సమాచారం. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజకీయ సెగ నుంచి తప్పించుకోవడానికి... తిరిగి టాలీవుడ్, కోలీవుడ్ వైపు చూస్తున్నారట రోజా. క్యారెక్టర్ రోల్స్ చేయడానికి నేను రెడీ... అంటూ తన టీమ్ ద్వారా తెలుగు, తమిళంలోని పలువురు దర్శకులకు, నిర్మాతలకు సంకేతాలు పంపినట్టు సమాచారం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12 నాటికి ఆరు నెలలు పూర్తి అవనుంది.. దీంతో, రాష్ట్రంలో పాలనను మరింత పరుగులు పెట్టించడానికి సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు.. ఇందు కోసం ఈనెల 11, 12 తారీఖుల్లో కలెక్టర్ల సదస్సు జరుపనున్నారు.. సచివాలయంలోని 5 వ బ్లాక్ లోని కలెక్టర్ కాన్ఫురెన్స్ హాల్లో సదస్సు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ నుంచి 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే, అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు.. 55 రోజుల్లో 4వేల 677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు రాజ్యసభ అభ్యర్థులు.. రాజ్యసభకు టీడీపీ నుండి ఎంపికైన బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుండి ఎంపికైన ఆర్.కృష్ణయ్య.. ఈ రోజు మంగళవారం సీఎం చంద్రబాబును కలిశారు.
విశాఖపట్నంలో నగరంలో నలుగురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. ఈ మధ్య రిలీజ్ అయినా లక్కీ భాస్కర్ అనే మూవీ చూసిన విద్యార్థులు అందులో హీరో తరహాలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చు.. కార్లు, ఇళ్లు కొనేసి తిరిగి వస్తామని స్నేహితుల వద్ద చెప్పి హాస్టల్ నుండి పరారయ్యారని తెలుస్తోంది.. మహారాణి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది..
శ్రీశైలం జలాశయ నీటి వినియోగంపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని సెంచునరి హల్ లో డీడీఆర్సీ నీటి పారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. గతంలో ఒకే రాష్ట్రం వున్నప్పుడు నీటి వాడకంపై ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు.. శ్రీశైలం జలాశయాలను రెండు రాష్ట్రాలవారు ఎవరికి వారే వాడితే.. రైతులే నష్టపోతారన్నారు మంత్రి కేశవ్. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలను తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. 2014లో విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు ఉండవల్లి.. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టుకోవడానికి పవన్ కల్యాణ్ శ్రద్ధ తీసుకోవాలని లేఖలో కోరారు..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం.. రేపటికి తమిళనాడు - శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమపై రెండు రోజులు ఉంటుందని చెబుతున్నారు..