ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం తీసుకుంది దేవస్థానం.. శ్రీశైలంలో ఇకపై భక్తుల రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించనున్నట్టు వెల్లడించారు నూతన ఈవో ఎం.శ్రీనివాసరావు.. అయితే, శని, ఆది, సోమవారాలు పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలివేస్తూ గతంలో దేవస్థానం ప్రకటించిన విషయం విదితమే కాగా.. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి స్పర్శ దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు…
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఇక చకచకా సాగనున్నాయి.. అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. సీఆర్డీఏ అథారిటీ అమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదాన్ని తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. రాజధానిలో చేపట్టనున్న ఈ 20 సివిల్ పనులకు 11,467 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు..
రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆర్.కృష్ణయ్య.. అయితే, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ పార్టీలో ఉన్నా.. తాను బీసీల సంక్షేమం కోసం పని చేస్తాను అని స్పష్టం చేశారు.. అయితే, ఈను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్నే పిలిచి సీటిచ్చారని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో సంచలనం రేపిన జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.. మాజీ ఎంపీ వ్యాఖ్యలతో రాజకీయ రంగు పులుముకుంది హనీ ట్రాప్ కేసు.. మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు బాధితులు.. హనీ ట్రాప్ కేసుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కామెంట్స్ పై బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
యువతులకు వారికి నచ్చిన వాటిని ఇస్తానని ఆశలు రేపి అత్యాచారాలకు పాల్పడిన నేరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో చోటుచేసుకుంది. సినిమాకు తీసుకెళ్తానని చెప్పి ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిసింది.
గత ప్రభుత్వానికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసునని.. కానీ ఆ చెత్తను ఉపయోగించి ఏ అద్భుతాలు చేయాలో తెలియదని మంత్రి నారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా నాయుడుపాలెం ప్రాంతంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు సందర్శించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో సరివెల వద్ద జాతీయ రహదారి-30పై గ్జైలో(XYLO) కారును పూర్తిగా దగ్ధం చేసారు. ఈనెల 2 నుండి 8 వరకు జరిగిన మావోయిస్టు వారోత్సవాలు ముగిసిన వెంటనే ఈ ఘటన జరగడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు.