Re-notification to 53 Bars: ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ అమ్మకాల అనుమతుల ఈ ఆక్షన్ కోసం మిగిలిన 53 బార్లకు రీనోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ నెల నుంచి 2025 ఆగష్టు 31 వరకూ లీజుకు అనుమతిచ్చేందుకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.. ఆన్‌లైన్ ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో అప్లికేషన్ ఇచ్చేందుకు ఇవాళ్టి నుంచి ఈనెల 23 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చింది.. ఈ నెల 23న అప్లికేషన్లను పరిశీలించనున్నారు.. ఈనెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సాధారణ ఆక్షన్ నిర్వహిస్తారు.. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ H1 లో 90 శాతం ఉండి వదిలివేయబడని బార్‌లకు ఆక్షన్ ఉండనుంది..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక, 50 వేల జనాభాలోపు ఉన్న ప్రాంతాలలో బార్లకు 5 లక్షల రూపాయల ఫీజు.. 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలలో బార్లకు 7.5 లక్షల రూపాయల ఫీజు.. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో బార్లకు 10 లక్షల రూపాయలు ఫీజుగా నిర్ధారించారు. చెల్లించిన ఫీజు ఏ కారణంగానూ తిరిగి చెల్లించబడదు అని స్పష్టం చేసింది ఏపీ ఎక్సైజ్ శాఖ.. అయితే, బార్ లకు నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఆక్షన్ వేసిన సమయంలో కొన్ని బార్లు మిగిలిపోయాయి.. ఇలా మిగిలిపోయిన బార్లకు ఈ రోజు రీ నోటిఫికేషన్ జారీ చేశారు.. రాష్ట్రంలో 53 బార్లకు రీ నోటిఫికేషన్ తీసుకొచ్చారు.. వాటికి ఈ ఆక్షన్ కండక్ట్ చేసి వారికి మరలా కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ మేరకు గెజిట్ విడుదల చేశారు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్.