రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవితా విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇంఛార్జ్ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం దాచుకోవడం దోచుకోవడం తప్ప.. ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆరోపించారు
ఆర్. కృష్ణయ్య మరోసారి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు కృష్ణయ్య.. మొత్తం మూడు రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ).. హర్యానా నుంచి రేఖా శర్మ.. ఒడిశా నుంచి సుజీత్ కుమార్.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్. కృష్ణయ్యను అభ్యర్థులుగా ప్రకటించింది..
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి విజయం సాధించారు.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోపి మూర్తి.. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందినట్టుగా చెబుతున్నారు..
విద్య, వైద్యం, వ్యవసాయం, త్రాగు, సాగునీటిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెనాయుడు మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగాయే కానీ, ఏలాంటి సేవలు అందించడం లేదని పేర్కొన్నారు.
Illegal Sand Mining: రాజమండ్రిలోని కొవ్వూరు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి, హేవలాక్ బ్రిడ్జిల మధ్య నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక తవ్వకాలపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
Nandikotkur: నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో ప్రేమోన్మాది చేతిలో హతమైన లహరి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన స్థలాన్ని క్లూస్ టీం క్షుణ్ణంగా పరిశీలించింది. లహరి మృతికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి (డిసెంబర్ 9) నుంచి రెండు రోజులు పాటు అధికారులు పింఛన్ల తనిఖీలు చేయనున్నారు. రాష్ట్రంలో నకిలీ పెన్షన్ దారులను ఏరి వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.