Sankranti Special Buses: సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ ఆర్టీసీ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తుంది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. కాగా, ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవు, అన్నీ బస్సులకు రెగ్యులర్ ఛార్జీలే వసూలు చేస్తారని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతికి 2,400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతికి గోదారి జిల్లాలకు సుమారు 25 లక్షల మంది వరకు వస్తారనే ఉద్దేశంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడానికి రెడీ అయింది.
Read Also: Akhanda 2 Thandavam : ఆ సినిమాలో బాలయ్య ఎంట్రీ సీన్ కోసం భారీ బడ్జెట్ తో స్పెషల్ సెట్
అలాగే, విశాఖ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 1000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఇవాళ (డిసెంబర్ 29) తెలిపింది. కాగా, ఇందులో విజయనగరం జోనల్ పరిధిలో 800 ప్రత్యేక బస్సులను తిప్పనున్నట్లు చెప్పుకొచ్చింది. విశాఖ నుంచి గరుడ, గరుడ+, అమరావతి, అల్ట్రా డీలక్స్, నైట్ రైడర్, క్రూయిజ్ సర్వీస్‌లను నడపబోతున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చేవారికి, విశాఖలో ఉంటూ స్వస్థలాలకు వెళ్లే వారికి ఈ బస్సులు ఉపయోగపడతాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.