* నేడు కొమురవెల్లిలో మల్లన్న స్వామివారి కళ్యాణం.. ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు.. కొమురవెళ్లి ఆలయంలో మూడు నెలల పాటు బ్రహ్మోత్సవాలు.. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్లు..
* నేడు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.
* నేడు హైదరాబాద్ లోనే మంత్రి గొట్టిపాటి రవికుమార్..
* నేటితో ముగియనున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు.. రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన మహాసభలు..
* నేడు శ్రీహరి కోటకు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. రేపు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV. C-60 రాకెట్ ప్రయోగం.. ఈరోజు రాత్రి 8 గంటల 58 నిమిషాలకు మొదలుకానున్న కౌంట్ డౌన్.. నానో శాటిలైట్ లను కక్ష్యలోని పంపనున్న ఇస్రో..
* నేడు ప్రొ కబడ్డీ ఫైనల్ మ్యాచ్.. ఫైనల్ లో తలపడబోతునన్న పాట్నా, హర్యానా.. పుణె వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్..
* తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 71,350.. 24 గ్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 77,840.. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 99,900.