Jc Prabhakar Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదని తెలిపారు. గతంలో చేసినవి అన్ని మార్చిపోయారా.. జేసీ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదు.. అసలు విక్టోరియా ఎవరూ.. అర్థరాత్రి సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబం కనపించలేదా అని మండిపడ్డారు. అసెంబ్లీలో భువనమ్మ గురించి మాట్లాడినప్పుడు ఏమైందన్నారు. పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు కుటుంబాలు కనబడలేదా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మంచితనంతో బ్రతికిపోతున్నారు.. ఆయన మంచితనంతో కార్యకర్తల చేతులు కట్టేశాడని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరితపిస్తున్నాడు అని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: South Korea Plane Crash: సౌత్ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో 179 మంది దుర్మరణం..
ఇక, వైసీపీ హయంలో చేసినవి గుర్తులేవా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఐదు నెలలోనే వైసీపీ వాళ్లు బయటకు వస్తున్నారంటే అది చంద్రబాబు మంచితనం వల్లే.. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఇబ్బందులు పెట్టారు.. పవన్ కళ్యాణ్ ను ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఆయన ఊరుకే ఉన్నాడు.. డిప్యూటీ సీఎం పవన్ కనుసైగా చేస్తే ఎవరూ మిగలారు అని పేర్కొన్నారు. దొంగతనం చేసి ఉంటే చేశానని ఒప్పుకో.. లేకపోతే ధ్తెర్యంగా నిలబడాలి.. నీకు బ్యాటరీ లేదు.. ప్రెస్ మీట్ లో నాని మాట్లాడుతుంటే ముఖంలో రక్తం చుక్క కనబడలేదు.. గుడివాడ నాయకులు ఎక్కడికి వెళ్లారు.. వైసీపీ హాయంలో ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే అవి గుర్తుకు రాలేదా.. నీచంగా మాట్లాడిన నాయకులను వదిలి పెట్టందండి అని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.