YS Jagan: ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణమన్నారు. ఈ అపూర్వ విజయంతో ఆమె స్వస్థలంతో పాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. ఆమె విజయం యువ ప్రతిభావంతులకు, ముఖ్యంగా బాలికలకు మరింత స్ఫూర్తిదాయకమన్నారు. కోనేరు హంపి నిరంతర కృషి, నిబద్ధతతో ప్రపంచ అత్యుత్తమ చెస్ క్రీడాకారిణిగా నిలిచిందని చెప్పుకొచ్చారు. ఆమె భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానంటూ వైఎస్ జగన్ అభినందనలు చెప్పుకొచ్చారు.
Read Also: Director Maruthi : డైరెక్టర్ మారుతి నెక్ట్స్ టార్గెట్ అతడే.. ఇప్పటికే కథ రెడీ
అలాగే, ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుతమైన విజయం సాధించిన కోనేరు హంపీకి మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. ఆమె విజయం దేశానికే గర్వకారణం అన్నారు. రెండో సారి ప్రపంచ టైటిల్‌ను గెలవడం హంపి ప్రతిభకు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. నేటి తరం బాలికలు కోనేరు హంపి కృషి పట్టుదలను ఆదర్శంగా తీసుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు మంత్రి అచ్చెన్నాయుడు.