Fake IPS : పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా ఓ నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి కేసును ఛేదించారు.
41 ఏళ్ల బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ట్రైనీ ఐపీఎస్ అధికారిగా వేషధారణ చేసి యూనిఫామ్‌లో పవన్ కల్యాణ్ పర్యటనకు హాజరైనట్టు ఏఎస్‌పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు. అతను పార్కింగ్ స్థలం వద్ద తొలిసారి నిలిపివేయబడినప్పటికీ, కొంత దూరం నడిచి వెళ్ళి మరోసారి కార్యక్రమ స్థలానికి చేరుకున్నాడు. అనంతరం పవన్ కల్యాణ్ వ్యూ పాయింట్ నుంచి శంకుస్థాపన ప్రాంతానికి వెళ్లి ఫొటోలు తీసుకుని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు.
AP News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళలు ఒక్కొక్కరికి రూ.24 వేలు
సూర్య ప్రకాష్ నడవడిపై కొందరికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నామని దిలీప్ కిరణ్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, పవన్ కల్యాణ్ కార్యక్రమం పూర్తయ్యాక మాత్రమే అతను ఫొటోలు దిగాడని, పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లలేదని స్పష్టం చేశారు.
దర్యాప్తులో సూర్య ప్రకాష్ తండ్రి దత్తిరాజేరులో 9 ఎకరాల భూమి కొనుగోలు చేసినప్పటికీ, రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో ఆ భూమిని సొంతం చేసుకునేందుకు పోలీసు అధికారిగా వేషధారణ చేసినట్టు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి కారు, ఐడీ కార్డులు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
HCA: అండర్19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక.. ఘనంగా సన్మానం