తన సొంత జిల్లాలో మరోసారి పర్యటించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కడప జిల్లాలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకోనున్న ఆయన.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు.
భూప్రకంపనలు ప్రకాశం జిల్లాను వీడడం లేదు.. వరుసగా మూడు రోజుల నుంచి భూప్రకంపనలు సంభవించడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.. తాజాగా, ముండ్లమూరు మండలంలో మరోసారి భూ ప్రకంపనలు స్థానికులకు కునుకు లేకుండా చేస్తున్నాయి.. రాత్రి 8:15 నిమిషాలకు.. 8:16 నిమిషాలకు.. 8:19 నిమిషాలకు వరుసగా మూడు సార్లు పెద్ద శబ్దంతో భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు..
భోగాపురం అద్భుతమైన ప్రాజెక్టుగా పేర్కొన్న ఆయన.. శరవేగంగా ప్రాజెక్టు పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నాం అన్నారు.. జూన్ 2026 కే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయని పూర్తి చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు.. విశాఖ ఎయిర్పోర్ట నుంచి అన్ని విభాగాల తరలింపు కూడా వేగవంతం చేస్తు్న్నామని వెల్లడించారు కేద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు..
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. అయితే, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొది.. విశాఖ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంగా.. మూడు రోజుల పాటు.. అంటే గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు..
బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ సమీక్షలో సామాజిక పింఛన్ల పంపిణీ అంశంపైనా చర్చించారు.. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలో అనేక మంది అనర్హులు ఉన్నారని చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలతో పాటు.. అధికారుల నివేదికల్లో కూడా ఇదే అంశం స్పష్టం అవుతోంది. దీంతో పింఛన్ల తనిఖీ చేపట్టనున్నారు.. అర్హులకు అందరికీ పింఛన్లు, పథకాలు అందాలన్నది తమ ఉద్దేశమని సీఎం చంద్రబాబు తెలిపారు.
బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా త్వరలో చట్టబద్ధత తెస్తామన్నారు సీఎం చంద్రబాబు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటాం అన్నారు..
కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది.. మేయర్ సీటు పక్కన తనకు కుర్చీ వేయాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆందోళనకు దిగడంతో ఈ సమావేశం రణరంగంగా మారిపోయింది.. సమావేశాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసినా పరిస్థితి కుదుటపడలేదు.. టీడీపీ సభ్యుల ఆందోళనలతో వైసీపీ సభ్యులు సమావేశాన్ని బాయికాట్ చేశారు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు బిజీ బిజీగా గడిపారు.. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గుడువర్రు గ్రామంలో పంచాయితీరాజ్ గ్రామీణావృద్ధిశాఖ చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.. ఆ తర్వాత గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామంలో రక్షిత తాగునీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించారు.