ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భద్రతలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. చంద్రబాబు భద్రతలో కౌంటర్ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి.. మావోయిస్టుల నుంచి ముప్పు, ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో మార్పులు చేర్పులు చేశారు అధికారులు..
ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో పలు కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు ప్రధాని. అనకాపల్లి జిల్లా పూడిమడక దగ్గర NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ప్రారంభిస్తారు.
ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం నాలుగు గంటలకు మోడీ విశాఖ చేరుకుంటారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకూ రోడ్ షో చేస్తారు. ఈ షోలో ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉంటారు. బహిరంగసభ జరిగే వేదికను ఇప్పటికే మంత్రులు పరిశీలించారు.
పాఠశాల విద్య స్థాయిలో బాలలకు పుస్తకాల భారం తగ్గించి నాణ్యత పెంచేలా నూతన పాఠ్య ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 2025-26 విద్యాసంవత్సరంలో కెజి నుంచి పిజి వరకు పాఠ్య ప్రణాళిక సమూల ప్రక్షాళన జరగాలన్నారు మంత్రి.. ఈ క్రమంలో.. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు.
విజయవాడ లబ్బీపేటలోని ఎస్.ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ 2024-25 కార్యక్రమంలో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన 24 స్టాల్స్‌ను లోకేష్ సందర్శించారు. ప్రతి స్టాల్ దగ్గర ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం.. విద్యార్ధుల పరిజ్ఞానం అడిగి తెలుసుకుంటూనే వారికి సూచనలిచ్చారు.
చిత్తూరు జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం, శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రత్యేక నిధులు రూ.10 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అర్బన్ ప్రాజెక్టుల నిర్వహణ, అధికారుల అతిథి గృహాల నిర్మాణం కోసం సమీకృత కాంప్లెక్స్, కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణం చేపట్టనున్నారు. రూ.60.20 కోట్లతో కుప్పంలో ఏర్పాటు చేసిన డీకే పల్లి పార్కుల అభివృద్ధి, సుందరీకరణ, కుప్పం ఏరియా అభివృద్ధిలో రోడ్డు జంక్షన్లు, వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నారు.